చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. వారిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని ఏరి వేస్తామన్నారు. ఒడిశా కందమాల్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ హతం అయ్యారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా ఆర్మీ, సైనిక, కూంబింగ్ దళాలు ఫుల్ ఫోకస్ పెట్టాయన్నారు.
మావోయిస్టులకు గతంలో పలుమార్లు లొంగి పోవాలని పిలుపు ఇచ్చామని స్పష్టం చేశారు అమిత్ షా . కానీ వారు వినిపించు కోలేదన్నారు. ఇప్పుడు తమంతకు తాముగా లొంగి పోతామంటూ ప్రకటనలు చేస్తున్నారని, మరోవైపు హింసాత్మక చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు అమిత్ చంద్ర షా. దాదాపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చి దిద్దుతామని ప్రకటించారు. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.






