నా వెనుక ఉంటూనే కుట్రలు పన్నారు
హైదరాబాద్ : మహిళల వస్త్రధారణ మీద అనుచిత కామెంట్స్ చేసి చివరకు క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద విచారణ చేపట్టారు. పలు ప్రశ్నలు వేశారు. ఒక బాధ్యత కలిగిన నటుడిగా ఉన్న మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. సమాజానికి ఏం మెస్సేజ్ ఇవ్వదల్చుకున్నారో చెప్పాలన్నారు. మాట్లాడేటప్పుడు ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాలని హతవు పలికారు. విచారణ అనంతరం నటుడు శివాజీ మీడియాతో మాట్లాడారు.
నా వెనుక ఉంటూనే తనను డ్యామేజ్ చేసేలా కుట్రలకు తెర లేపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివాజీ. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇంత కుట్ర చేయాలా నామీద అంటూ వాపోయారు. ZOOM మీటింగులు పెట్టుకున్నారు. నాతో బాగా ఉంటూనే నా వెనుక గోతులు తవ్వారంటూ ఆరోపించారు. తాను ఎవరిని కించ పరిచేలా మాట్లాడ లేదని చెప్పారు . ఇక నుంచి సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానేస్తానంటూ తెలిపాడు శివాజీ. నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. సినిమా కాకపోతే.. నేను రైతు కొడుకుని నాకు 30 ఎకరాల పొలం ఉందన్నారు. చివరకు అక్కడికి వెళ్లి పొలం పనులు చేసుకుని బతుకుతానని చెప్పారు శివాజీ.






