మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎత్తి చూపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా ముందుకు వెళితే ఎలా అని ప్రశ్నించారు. శనివారం శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. GHMC అనైతిక డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మీ ఇష్టం వచ్చినట్లు డివిజన్లు మారుస్తాము అంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే హైదరాబాద్ పేరు మార్చమనండి అని సవాల్ విసిరారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
సికింద్రాబాద్ సమీపంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఉంటే దాన్ని మల్కాజ్‌గిరిలో కలుపుతున్నారని ఇదేం పద్దతి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో ప్రజా పాలన సాగడం లేదని, దీని పేరుతో పిచ్చోడి చేతిలో రాయిలా అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అన్నింటిని , సీఎం ఒంటెద్దు పోకడను ప్రజలు చూస్తున్నారని, ఏదో ఒక రోజు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు శ్రీనివాస్ యాదవ్. డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా రైలు రోకోలు, నిరహార దీక్షలు, శాంతియుత పోరాటాలు, న్యాయ పోరాటాలు చేస్తామని ప్రకటించారు.






