స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
సికింద్రాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్మారాన్ని ఆప గలిగే శక్తి ఒక్క అధికారానికే ఉంటుందన్నారు. తాను ఎంపీగా గెలిచానంటే అది మీరంతా పని చేయడం , మద్దతు ఇవ్వడం వల్లనే సాధ్యమైందని అన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కానీ.. ఒక్క జడ్పిటిసి కానీ.. ఒక మున్సిపల్ చైర్మన్ కానీ… నీటి సంఘాల చైర్మన్లు ,సింగిల్ విండో చైర్మన్లు ఏదీ ఓడిపోలేదన్నారు. వయసు, రాజకీయ జీవితం చిన్నదే అయినా.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా కొట్లాడానని చెప్పారు. ఒక 40 ఎలక్షన్స్ కు ఇంచార్జిగా పని చేశానని అన్నారు. గెలవాలంటే మొట్ట మొదటిగా.. మంచి అభ్యర్థిని ఎంపిక చేయండి. సామాజిక వర్గాల సమీకరణ మర్చిపోవద్దు. వాతావరణ కల్పన జరగాలి. ఎదుటి వారికి చెమటలు పట్టించాలి. గట్టి లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని స్పష్టం చేశారు ఎంపీ.
భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిస్తే అది ఒకటి గుజరాత్ నుంచి ఇంకోటి తెలంగాణ నుంచి.. ఇప్పుడు గుజరాత్ ఎక్కడ ఉంది..? తెలంగాణ ఎక్కడ ఉంది..? ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఒక పెద్ద మనిషి మమ్మల్ని హెచ్చరించారని అన్నారు. 27 ఏళ్ల తర్వాత కూడా గుజరాత్ లో మళ్లీ అధికారంలోకి వస్తే.. 45 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో అధికారం వస్తుందో రాదో అనే సంశయంలో ఉన్నారు అని అన్నారు. పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి అక్కున చేర్చుకోండి. కాకులు గద్దల లెక్క పొడవకండి అని సూచించారు. రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలని కోరారు ఈటల రాజేందర్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని గుర్తు పెట్టుకోవాలన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ లో 1992 నుండి ఉంటున్న నన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారిని పట్టించు కోవద్దని సూచించారు.






