బావా బామ్మర్దులపై భగ్గుమన్న చామల
కేసీఆర్ చావు కోసం ఎదురు చూస్తున్నారు
హైదరాబాద్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి కోసం గుంట నక్క లాగా కేటీఆర్ , పార్టీ పగ్గాల కోసం హరీశ్ రావులు గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారంటూ మండిపడ్డారు. తమ నాయకుడు, సీఎం ఎ.రేవంత్ రెడ్డి పది మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి అని అన్నారు. కానీ ఏనాడూ కేసీఆర్ చచ్చి పోవాలని కోరుకునే రకం కాదన్నారు. తను బాత్రూంలో కాలుజారి కింద పడి ఆస్పత్రి పాలైతే సీఎంగా వెళ్లి పరామర్శించింది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
అంతేకాదు మొన్నటికి మొన్న అసెంబ్లీలో కేసీఆర్ బాగోగులు అడిగి తెలుసుకున్నారని ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా పడితే అలా రేవంత్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఎలా అని ప్రశ్నించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. నీళ్ల గురించి వాస్తవాలు కేసీఆర్ ప్రజలకు చెప్పాలని అన్నారు.
ఏం చేద్దామని కాళేశ్వరం కడదామని అనుకున్నారని నిలదీశారు. అదే విధంగా పాలమూరు, రంగారెడ్డి సోర్స్ పాయింట్ ను జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారో ఆన్సర్ ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి తెలంగాణను రావణ రాజ్యంలా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ దౌర్భాగ్యమైన పరిపాలన వల్లనే ప్రజలు రేవంత్ రెడ్డికి సీఎంగా అవకాశం ఇచ్చారని , ఆ విషయం మరిచి పోవద్దన్నారు. మరో పదేళ్ల పాటు మావోడే రాజ్యాన్ని ఏళుతాడని అన్నారు.






