పిలుపునిచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా సేవలు మరింత పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. యువ మిత్రల సేవలను కింది స్థాయి వరకు తీసుకు వెళతామని అన్నారు. అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు.., ఎలా బయట పడగలం, వరదలు వస్తే ఎలా కాపాడాలి, గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్ననప్పుడు సీపీఆర్ విధానం గురించి ఈ వారం రోజుల శిక్షణలో తెలుసుకున్నామని పలువురు యువ ఆపద మిత్ర వాలంటీర్లు ఈ సందర్భంగా చెప్పారు. శిక్షణలో ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో చాలా అవగాహన వచ్చిందని.. మరికొంత మందికి నేర్పుతామని విద్యార్థులు చెప్పారు.
హైడ్రా సేవలు హైదరాబాద్‌కే కాకుండా.. జిల్లా ప్రధాన కేంద్రాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ప్రకృతి పరిరక్షణ సాధ్యమని పలువురు విద్యార్థులు ఈ సందర్బంగా కోరారు. వారం రోజుల శిక్షణలో భాగంగా హైడ్రా కార్యకలాపాలపై కూడా పూర్తి అవగాహన వచ్చిందన్నారు ఏవీ రంగనాథ్. హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆర్. సుదర్శన్ , అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. హైడ్రా ఆర్ఎఫ్‌ఓ జయప్రకాశ్, డీపీవోలు యజ్ఞ నారాయణ, గౌతమ్, ఏడీఎఫ్‌వో మోహనరావు, శ్యామ్ మోహన్, ఇన్‌స్పెక్టర్ షంషుద్దీన్, ఎన్‌డీఎంఏ కన్సల్టెంట్ డా. గౌతమ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






