జ‌ల‌మండ‌లి భూమిని కాపాడిన హైడ్రా

రాంపూర్‌లో 4 ఎక‌రాల చుట్టూ ఫెన్సింగ్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. భూ ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జ‌దారుల‌కు చెక్ పెడుతోంది. ప్ర‌తి సోమవారం హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు. భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలీంచిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హైడ్రా సిబ్బంది పెద్ద ఎత్తున ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా తాజాగా భారీ ఎత్తున ఆక్ర‌మ‌ణ‌కు గురైన ప్ర‌భుత్వ భూమిని గుర్తించారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కీస‌ర మండ‌లం రాంప‌ల్లి విలేజ్ స‌ర్వే నంబ‌రు 388లో జ‌ల‌మండ‌లికి (HMWSSB)కి చెందిన 4.01 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది.

జ‌ల‌మండ‌లి అవ‌స‌రాల మేర‌కు ఇక్క‌డ భూమిని కేటాయించింది గ‌తంలో స‌ర్కార్. దానిని స్వాధీనం చేసుకోవ‌డంలో స్థానికులు ఇబ్బందులు పెట్టారు. ఆక్ర‌మ‌ణ‌దారులు వారిని బెదిరింపుల‌కు గురి చేశారు. ప్ర‌హ‌రీ నిర్మాణాన్నిఅడ్డుకుని ఆటంకాలు సృష్టించారు. దీంతో హైడ్రా స‌హాయాన్ని జ‌ల‌మండ‌లి కోరింది. సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి జ‌ల‌మండ‌లికి ప్ర‌భుత్వం కేటాయించిన‌ట్టు హైడ్రా నిర్ధారించుకుంది. ఈ మేర‌కు 4.01 ఎక‌రాల జ‌ల‌మండ‌లికి చెందిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. జ‌ల‌మండ‌లికి చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *