గిరిజ‌న ప్రాంతాల్లో వైద్యులు సేవ‌లు అందించాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడ‌లో పేరు పొందిన రంగ‌రాయ మెడిక‌ల్ కాలేజీని సంద‌ర్శించారు. రోగుల‌కు అందిస్తున్న సేవ‌ల గురించి ఆరా తీశారు. ఈ వైద్య క‌ళాశాల కాకినాడ‌కు గ‌ర్వ కార‌ణం అని పేర్కొన్నారు. నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాల‌ని స్ప‌ష్టం చేశారు. పేద ప్రజలకు చికిత్స అందించాల‌ని, సమాజానికి అండగా నిలవాల‌ని పిలుపునిచ్చారు కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ మెడిక‌ల్ కాలేజీ ఎంతో మంది వైద్యుల‌ను రాష్ట్రానికి అందించింద‌ని చెప్పారు. పూర్వ విద్యార్థుల (రాంకోసా) ఆర్థిక సాయంతో నూతన భవనాన్ని నిర్మించడం ఆనందంగా ఉందన్నారు .

భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా ఎద‌గాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. కోట్లాది రూపాయ‌ల కంటే క‌ష్ట కాలంలో ఆదుకోవ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మాన‌వ సేవ కంటే మాధ‌వ సేవే గొప్ప‌ద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌ను కావాల‌ని నిర్వీర్యం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు . కానీ తాము అధికారంలోకి వ‌చ్చాక విద్య‌, వైద్య రంగాల‌కు ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ‌చ్చామ‌ని, ప్ర‌స్తుతం పీపీపీ ప‌ద్ద‌తిన మెడిక‌ల్ కాలేజీల‌ను అభివృద్ది చేస్తామ‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *