ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

Spread the love

18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ

న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల‌లో ఫిఫా ట్రోఫీని ప్ర‌ద‌ర్శిస్తోంది. తాజాగా న్యూఢిల్లీ లోని తాజ్ హోటల్ లో ట్రోఫీని ఆవిష్కరించారు కేంద్ర మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ‌. ప్ర‌స్తుతం ఇండియాలో క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ క్రీడ‌కు రాను రాను ఆద‌ర‌ణ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కోకో కోలా త‌న వ్యాపార సామ్రాజాన్ని మ‌రింత‌గా విస్త‌రించేందుకు ప్లాన్ చేసింది. కోట్లాది మంది భార‌తీయులు కోక్ ను ఇష్ట ప‌డ‌తారు. గ‌తంలో క్రికెట్ ను కూడా స్పాన్స‌ర్ చేస్తోంది.

ఇక ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ను 18 క్యారెట్ల చొక్క‌మైన బంగారంతో త‌యారు చేశారు. దీని బ‌రువు సుమారు 6,175 కిలోలు ఉంటుందని అంచ‌నా. కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ టూర్ కు శ్రీ‌కారం చుట్టింది. దాదాపు 50 ఏళ్లుగా దీనిని నిర్వ‌హిస్తూ వ‌స్తోంది కోక్ కంపెనీ. ట్రోఫీ 75 స్టాప్‌లు, 150 కంటే ఎక్కువ టూర్ రోజులలో 30 FIFA సభ్య సంఘాలను (దేశాలు) సందర్శిస్తుంది, అభిమానులకు ఫుట్‌బాల్ థ్రిల్ , కనెక్షన్‌ను అనుభవించడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇద్దరు మానవ బొమ్మలు వాటి పైన భూగోళాన్ని పట్టుకున్న కూర్పుగా సృష్టించ బడ్డాయి. ప్రస్తుత డిజైన్ 1974 నాటిది. దేశవ్యాప్తంగా లోతుగా పాతుకుపోయిన ఫుట్‌బాల్ సంస్కృతిని జరుపుకోవడానికి ప్రపంచ క్రీడా క్షణాలకు కోకా-కోలా నిబద్ధతను FIFA ట్రోఫీ టూర్ నొక్కి చెబుతుంది.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ముంబై స్కిప్ప‌ర్ గా శ్రేయాస్ అయ్య‌ర్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ముంబై : దేశీవాళి టోర్నీ విజ‌య్ హ‌జారే ట్రోఫీ కోసం జ‌రుగుతున్న మ్యాచ్ ల‌లో ఉన్న‌ట్టుండి ముంబై జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ కు గాయం అయ్యింది. దీంతో త‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *