పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ధర్మాసనం
న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సోమవారం విచారణ చేపట్టింది తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ పై. పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ధర్మాసనం. ఈ సందర్బంగా బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ సీరియస్ గా వ్యాఖ్యానించింది. అయితే పిటిషన్ దాఖలు చేసే ముందు ముందూ వెనుకా ఆలోచించక పోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. చివరకు పిటిషనర్ తరపు న్యాయవాది సింఘ్వీ చేసిన వినతి మేరకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చేందుకు ఓకే చెప్పింది.
ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో తాము పిటిషన్ ఉపసంహరించు కుంటున్నామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. దీంతో రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వాదనలు కూడా వినాల్సి ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.






