ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ప్రజా పాలన సాగిస్తున్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుండి ప్రజా వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలల్లో మౌలిక వసతులను కల్పించారు. పెద్ద ఎత్తున ఖర్చు చేసి జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఆనాటి సీఎం కేసీఆర్. తీరా ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యాక్రమాలు, పథకాలకు మంగళం పాడారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం వ్యక్తిగత కక్షతో ఆయన కొలువు తీరిన వెంటనే తెలంగాణ సర్కార్ పేరుతో ఉన్న టీఎస్ ను టీజీగా మార్చేశారు. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరోసారి జిల్లాలను మార్చుతామని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన దివ్యాంగుల సమావేశంలో ప్రసంగించిన ఆయన జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబందించి సంచలన ప్రకటన చేశారు . ఇందులో భాగంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందులో రిటైర్డ్ జడ్జితో పాటు విశ్రాంత అధికారులు ఉంటారని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని సదరు కమిటీని కోరుతామని వెల్లడించారు. వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తాం చెప్పారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.






