జిల్లాల పునర్వ్యస్థీకరణపై ప్ర‌త్యేక క‌మిటీ

Spread the love

ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుండి ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో పాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల‌ల్లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించారు. పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేసి జిల్లాల క‌లెక్ట‌రేట్లు, ఎస్పీ కార్యాల‌యాల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు ఆనాటి సీఎం కేసీఆర్. తీరా ప్ర‌భుత్వం మార‌డంతో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చేప‌ట్టిన కార్యాక్ర‌మాలు, ప‌థ‌కాల‌కు మంగ‌ళం పాడారు సీఎం రేవంత్ రెడ్డి. కేవ‌లం వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో ఆయ‌న కొలువు తీరిన వెంట‌నే తెలంగాణ స‌ర్కార్ పేరుతో ఉన్న టీఎస్ ను టీజీగా మార్చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించేలా నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాజాగా మ‌రోసారి జిల్లాల‌ను మార్చుతామ‌ని, కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తామంటూ ప్ర‌క‌టించారు.

తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన దివ్యాంగుల స‌మావేశంలో ప్ర‌సంగించిన ఆయ‌న జిల్లాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు సంబందించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . ఇందులో భాగంగా ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. ఇందులో రిటైర్డ్ జడ్జితో పాటు విశ్రాంత అధికారులు ఉంటార‌ని ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని స‌ద‌రు క‌మిటీని కోరుతామ‌ని వెల్ల‌డించారు. వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తాం చెప్పారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

  • Related Posts

    తాజా ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే విజ‌యం

    Spread the love

    Spread the loveధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇండియా కూట‌మి త‌ర‌పున పెద్ద ఎత్తున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇండియా కూట‌మిలోని…

    ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్ర‌తినిధులు భేటీ

    Spread the love

    Spread the loveరూ. 200 కోట్ల‌తో అమ‌రావ‌తిలో క్యాంప‌స్ నిర్మాణం అమ‌రావ‌తి : భార‌త దేశంలో విద్యా ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంప‌స్, యూనివ‌ర్శిటీ. ఈ సంద‌ర్బంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా బిట్స్ పిలానీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *