నిప్పులు చెరిగిన పల్లె రవి కుమార్ గౌడ్
హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లె రవికుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. తెలంగాణతో పాటు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం కంకణం కట్టుకున్నాడని, ఆయన కుట్రలు చెల్లుబాటు కావన్నారు. ఇక్కడి ప్రజలు అత్యంత చైతన్యవంతం కలిగి ఉన్నారని, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మోసాలను గుర్తించారని అన్నారు. రాచకొండ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. గురువారం పల్లె రవి కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాచకొండ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ఉందన్నారు. రాచకొండ కోట పోరాటానికి, ధిక్కారానికి ప్రతీక అని చెప్పారు. రాచకొండ చరిత్ర ప్రజలకు తెలియ చేయడానికి కేసీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి కంటే అహంకారి ఎవరూ లేరన్నారు పల్లె రవి కుమార్ గౌడ్. ఇక్కడి చరిత్ర రేవంత్ కు తెలియదన్నారు. ఈ ఘనమైన పోరాటంలో, చరిత్రలో ఏనాడూ సీఎం భాగస్వామిగా లేడని అన్నారు. అది తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా ఉన్న మండలం ఎక్కడా లేదని అన్నారు పల్లె రవికుమార్ గౌడ్. విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ జిల్లా పరిధిని మార్చడానికి వీలు లేదని అన్నారు. ఏ జిల్లాను తగ్గించినా బిఆర్ఎస్ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడిందన్నారు. జిల్లాల సంఖ్యను తగ్గించం అని చెప్తూనే రేషనైలేషన్ చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు.






