వికేంద్రీక‌ర‌ణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్ర‌

తెర లేపారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. వికేంద్రీక‌ర‌ణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్ర‌కు తెర లేపాడ‌ని ఆరోపించారు. కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని అన్నారు. ఆనాడు పాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే ఉద్యోగుల విభజన జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి జిల్లాల తేనె తుట్టెను కదప బోతున్నార‌ని, ఆయ‌న క‌దిలిస్తే సీటు నుంచి దిగి పోవ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు కేటీఆర్. ఇప్పటికే నిరుద్యోగులు ఆందోళన బాట ప‌ట్టార‌ని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు, తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్రకు పాల్ప‌డితే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని అన్నారు.

ఎన్టీఆర్ పెట్టిన మండలాలతో లాభం జరగలేదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ చేసిన జిల్లాల మీద కడుపు మంట ఎందుకు అంటూ నిల‌దీశారు. ఎన్నికలు ముందు దేవుళ్లులాగా మాట్లాడి ఇప్పుడు మారీచుల్లాగా మారారంటూ ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో పేరుకు పోయిన స‌మ‌స్య‌ల‌పై ఎందుకు మాట్లాడ‌టం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇక నుంచి జిల్లాల పునర్విభజనపై బిఆర్ఎస్ పోరాటం చేస్తోందని ప్రక‌టించారు. మీకు ఇష్టం వచ్చినట్లు జిల్లాలు చేస్తే ఒప్పుకోమని అన్నారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బ‌కాయిలు చెల్లించ‌క పోవ‌డంతో ఇప్పటి వరకు 140 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *