ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఈసీ
ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశంలో గత 2014 నుంచి పెద్ద ఎత్తున ఓట్ల చోరీ కొనసాగుతోందని, ఇదేమీ ఆశ్చర్యం కాదన్నారు. ఇదిలా ఉండగా బీఎంసీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఓట్లు వేసేందుకు ఉపయోగించే సిరా (ఇంకు) ఉన్నట్టుండి చెరిగి పోవడంతో ఓట్లు వేసిన వారంతా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు ఆధారాలను వారు ప్రత్యక్షంగా ప్రదర్శించారు కూడా.
సిరా తుడిచి పెట్టడం పై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మొత్తం వ్యవహారంపై తమకు అనుమానం ఉందని, తక్షణమే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని రాజ్ థాక్రే డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీనిపై స్పందించింది మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. దీనిపై మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. తాజాగా సిరా తుడిచి పెట్టుకు పోవడం అనే అంశం వివాదాస్పదంగా మారింది. ఆపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.






