అల్లు అర్జున్ పుష్ప వెరీ వెరీ స్పెషల్
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు అల్లు అర్జున్. తను ప్రస్తుతం అత్యధికంగా పారితోషకం తీసుకునే నటులలో టాప్ లో కొనసాగుతున్నాడు బన్నీ. తను డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ దుమ్ము రేపింది. కాసుల వర్షం కురిపించింది. ఇండియాలో అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 1784 కోట్లు వసూలు చేసింది. తను నటించిన పుష్ప వరల్డ్ వైడ్ గా జనాదరణ పొందింది. ఇంకా నడుస్తూనే ఉంది. ఓటీటీలో కూడా రికార్డ్ ధరకు అమ్ముడు పోయింది. ఇక అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా జపాన్ లో తనకు మరింత క్రేజ్ పెరిగింది. ఏకంగా అక్కడ కూడా తాను నటించిన సీక్వెల్ మూవీ పుష్ప -2ను జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు వారి భాషలో. దీంతో అక్కడ కూడా పుష్ప హల్ చేస్తోంది. తాజాగా జపాన్ లో ఉన్న తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అక్కడి జపాన్ మీడియా అల్లు అర్జున్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. తన అనుభవాలను, నటనకు సంబంధించిన అంశాలను, చిత్ర విశేషాలను పంచుకున్నాడు ఈ సందర్బంగా . ఇదిలా ఉండగా జపాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.






