ఉస్తాద్ భగత్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు, రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనతో డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మరోసారి మూవీ తీస్తున్నాడు. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ అనుకోని అవాంతరాలు, పవన్ కళ్యాణ్ పూర్తి సమయం కేటాయించక పోవడంతో సినిమా అటకెక్కింది. ప్రస్తుతం తను డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏపీకి. తాజాగా తను ఫ్రీగా ఉండడంతో ఎక్కువ సమయంలో సినిమా షూటింగ్ కోసం కేటాయించాడు. హరీశ్ శంకర్, పవర్ స్టార్ లు కలిసి గతంలో గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఇందులో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల కీ రోల్ పోషిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి దేఖ్ లేంగే సాలా అన్న పాటకు డ్యాన్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా దర్శకుడు హరీశ్ శంకర్ సంచలన ప్రకకటన చేశాడు. సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోందని, వచ్చే ఏప్రిల్ నెలలో ఉస్తాద్ భగత్ సింగ్ ను విడుదల చేస్తామని వెల్లడించాడు. దీంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో సినిమా డిజిటల్ రైట్స్ ను కైవసం చేసుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. కానీ చివరకు భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ స్వంతం చేసుకుంది ఈ మూవీని.





