నారా వారి పల్లెలో అందించిన ఈవో సింఘాల్
తిరుపతి జిల్లా : సంక్రాంతి పర్వదినం సందర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు నారా లోకేష్ , మనవడు నారా దేవాన్ష్ తో పాటు కుటుంబీకులు సందడి చేశారు. ప్రతి పండుగకు తన స్వంత ఊరులో సందడి చేస్తారు. సీఎం రాక సందర్బంగా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సదర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నారా వారి పల్లెకు చేరుకున్నారు. ఈ సందర్బంగా సీఎం దంపతులకు ఆ కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్ర పటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, వేద పండితులు పాల్గొన్నారు.







