రూ. 63 లక్షలు కోల్పోయానంటూ ఫిర్యాదు
హైదరాబాద్ : సైబర్ వలలో పలువురు పడ్డారు. కోట్లాది రూపాయలు నష్ట పోతున్నారు. కష్టపడిన వారంతా అత్యాసకు గురై డబ్బులను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలను పోగొట్టుకుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 50 శాతానికి పైగా అదనంగా డబ్బులు వస్తాయంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. తన వద్ద ఉన్న డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసి షేర్ మార్కెట్ లో జమ చేసింది. తీరా తాను మోస పోయానని తెలుసుకుని బావురుమంది. చివరకు జేడీ, తన భార్యతో కలిసి సైబర్ మోసానికి గురైనట్లు ఫిర్యాదు చేశారు సైబర్ పోలీసులకు. విచిత్రం ఏమిటంటే నేరాలను ఛేదించడంలో మోస్ట్ పాపులర్ ఐపీఎస్ , సిన్సియర్ ఆఫీసర్ గా గుర్తింపు పొందాడు.
ఇదిలా ఉండగా శుక్రవారం మరో మసోం బయట పడింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు తేజ తనయుడు అమితోవ్ తేజ కూడా దీని బారిన పడ్డాడు. నకిలీ ట్రేడింగ్ లో పాల్గొన్నాడు. అత్యధిక ఆశకు బలయ్యాడు. తాను కష్టపడి సంపాదించిన డబ్బులు రూ. 63 లక్షలను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. తీరా తాను మోసపోయానని గుర్తించాడు. అయితే ఈ డబ్బులు తన తండ్రి తేజ నుంచి ఒక్క పైసా తీసుకోలేదని చెప్పాడు. అయితే కోల్పోయిన డబ్బులన్నీ తను సంపాదించనవేనని పేర్కొన్నాడు. హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





