రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంలోని పర్యాటక , సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కైట్, స్వీట్స్ ఫెస్టివల్ -2026ను నిర్వహించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో గత మూడు రోజులుగా దీనిని నిర్వహించారు. ఈ సందర్బంగా 40కి పైగా దేశాలకు చెందిన పతంగుల ప్రదర్శనకారులు ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. పాల్గొన్న వారికి సర్కార్ తరపున బహుమతులను కూడా అందజేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ఫెస్టివల్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
అన్ని గాలిపటాల ఫ్లైయర్లను అభినందించారు. వారి భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి మెమెంటోలతో సత్కరించారు. వారాంతపు వండర్స్ పోటీ విజేతలను కూడా వేదికపైకి ఆహ్వానించారు . బహుమతి డబ్బును అందజేశారు. ముగింపు రోజు ప్రభుత్వ సెలవు దినం కావడంతో, పరేడ్ గ్రౌండ్స్ భారీ జన సమూహాన్ని చూసింది. రంగురంగుల గాలిపటాలు ఎత్తుకు ఎగురుతూ సికింద్రాబాద్ స్కైలైన్ను ఉత్సాహ భరితమైన ఇంద్రధనస్సుగా మార్చాయి. ఈ కార్యక్రమం విజయవంతం అయిన తరువాత, జనవరి 18 వరకు జరగనున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సందర్బంగా ప్రముఖ గాయని మంగ్లీ ప్రత్యక్ష కచేరీ నిర్వహించనున్నారు.






