రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు) సూచించే ప్రభలు (మత పరమైన కళా ఖండాలు) ఒకే వేదికపైకి చేరతాయి, ఇది ఈ ప్రాంతంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సమావేశాలలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు సీఎం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శతాబ్దాల నాటి మత పరమైన పండుగగా గత కొంత కాలంగా ‘ప్రభల తీర్థంస విరాజిల్లుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం నారా వారి పల్లెలో ఉన్న చంద్రబాబు గ్రీటింగ్స్ తెలిపారు చంద్రబాబు నాయుడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కనుమ రోజున జగన్న తోట గ్రామంలో జరిగే ఈ ఆధ్యాత్మిక , సాంస్కృతిక ఉత్సవం 400 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.
దేశం నలుమూలల నుండి భక్తులు ఇందులో పాల్గొంటారు. . 476 సంవత్సరాల పురాతనమైన విశిష్టమైన జగన్న తోట ప్రభల తీర్థానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించడం జరిగిందని తెలిపారు చంద్రబాబు నాయుడు. అయితే తమ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తుందని, దీనివల్ల ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి అన్నారు. సంక్రాంతి పండుగ వేళ ప్రభల తీర్థం జరుపు కోవడం మరింత ఆనందంగా ఉందన్నారు .







