ఇవాళ ప్రకటించిన మూవీ మేకర్స్
ముంబై : బాలీవుడ్ లో ఇప్పటికే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బోర్డర్. దీనికి సీక్వెల్ గా బోర్డర్ -2 రూపుదిద్దుకుంది. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రధాన పాత్రలో నటించారు సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్. 1971లో భారత దేశం, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్దం లో చోటు చేసుకున్న వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అద్భుతమైన సంభాషణలు, ఆకట్టుకునే చిత్రీకరణ, అంతకు మించి ఒళ్లు గగుర్పొడిచేలా డైలాగులు, వెరసి మొత్తంగా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.
తొలి పార్ట్ లో సంభాషణలు హైలెట్ గా నిలిచాయి సినిమాకు. అంతే కాకుండా ఆనాడు చోటు చేసుకున్న సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు అనురాగ్ సింగ్ సక్సెస్ అయ్యాడు. శుక్రవారం అధికారికంగా బోర్డర్ -2 మూవీకి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. మరోసారి సన్నీ డియోల్ నటనా పరంగా విశ్వ రూపం ప్రదర్శించాడు. మరోసారి బిగ్ హిట్ సాధించేందుకు కావాల్సిన అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం కంటే ముందు జనవరి 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది బోర్డర్ -2 మూవీ.





