తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్న కోమటి రెడ్డి
నల్లగొండ జిల్లా : నల్లగొండ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇప్పటికే పట్టణ అభివృద్ది కోసం రూ. 2000 కోట్లు మంజూరు చేశామన్నారు. మౌలిక వసతుల కల్పన కొనసాగుతుందన్నారు. మరో వైపు ఇంకా అభివృద్ది పనుల కోసం ఇంకా రూ. 2000 కోట్లు తీసుకు వచ్చేందుకు తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇదిలా ఉండగా నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించిన సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు.
కార్పొరేషన్ హోదాతో కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకునే అవకాశం లభించిందని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేవలం 25 నెలల్లోనే కార్పొరేషన్ హోదాను సాధించడం జరిగిందన్నారు. గతంతో పోలిస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, రూ.700 కోట్లతో ఓఆర్‌ఆర్, ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్డు, బ్రహ్మగారి గుట్ట–లతీఫ్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి–అనంతారం రోడ్లు, ఎస్ఎల్‌బీసీ పూర్తి లక్ష్యం, ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు కేటాయించామన్నారు.





