పలు దిగ్గజ కంపెనీలతో వరుస సమావేశాలు
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో తండ్రీ కొడుకులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదిలా ఉండగా బుధవారం కీలక సంస్థలతో సమావేశం అయ్యారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల గురించి ప్రత్యేకంగా వివరించారు నారా లోకేష్. జపాన్ కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈవో , చైర్ యుకియో కానితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసియా మార్కెట్లకు లో-కార్బన్ అమ్మోనియాను సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని సమీపంలోని గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని యుకియో కాని పేర్కొన్నారు. మొన్న Google.. నిన్న ReNew Power.. నేడు RMZ Group ప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించారు నారా లోకేష్. విశాఖపట్నంలో GCC పార్క్‌ను అభివృద్ధి చేయడానికి RMZ Group అంగీకారం తెలిపిందన్నారు మంత్రి. దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో RMZ ఈ ప్రకటన విడుదల చేసింది.





