వెంకటాపురంలో ఘనంగా నివాళులు
అనంతపురం జిల్లా : తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్బంగా వెంకటాపురంలోని స్వస్థలంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వేలాది మంది హాజరయ్యారు. కన్నీటి నివాళులు అర్పించారు. జోహార్ రవన్న, అమర్ రహే రవన్న అంటూ నినాదాలు చేశారు. పరిటాల రవీంద్ర భార్య, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత, కొడుకు , టీడీపీ సీనియర్ నేత పరిటాల శ్రీరామ్, సోదరుడు, కోడళ్లు , బంధువులు, ఆత్మీయులు, సహచరులు, అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చారు.
టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దివంగత పరిటాల రవీంద్రతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల మనిషిగా పరిటాల నిలిచి పోతారని పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, ప్రజల కోసం చివరి దాకా బతికిన అరుదైన నాయకుడు అని ప్రశంసలు కురిపించారు. ప్రజా నాయకుడికి మరణం లేదన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు పరిటాల రవీంద్ర బతికే ఉంటారని స్పష్టం చేశారు. ఆయన భౌతికంగా లేక పోయినా రవీంద్ర చేసిన సేవలు ఎల్లప్పటికీ నిలిచే ఉంటాయన్నారు.






