స్పష్టం చేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్ : ఎందరో చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే ఈ దేశానికి స్వేచ్ఛ లభించిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు గవర్నర్.
సమాజంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా గుర్తించిందన్నారు. అందుకే వారందరికీ ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించిందని స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించిందని తెలిపారు. దీని కారణంగా రూ. 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఆకర్షించిందని, పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఎస్సీ ఉప-వర్గీకరణ , సమగ్ర సామాజిక-ఆర్థిక సర్వేలతో సహా సామాజిక సాధికారతలో చొరవలను కూడా గవర్నర్ హైలైట్ చేశారు.
తన సందేశాన్ని ముగించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ, దేశానికి శ్రేయస్సు, శాంతిని కోరుకున్నారు.






