‘మ‌రాఠా’పై అజిత్ ప‌వార్ ‘దాదా’ ముద్ర

Spread the love

శోక సంద్రంలో మ‌హారాష్ట్ర ప్ర‌జానీకం

ముంబై : ఎవ‌రూ ఊహించ లేదు ఇంత ఘోరం జ‌రుగుతుంద‌ని. ఎవ‌రూ క‌ల క‌న‌లేదు ఇంత త్వ‌ర‌గా అజిత్ ప‌వార్ నిష్క్ర‌మిస్తాడ‌ని. త‌ను కూడా అనుకోని ఉండ‌డు ఇంత త్వ‌ర‌గా కాల‌గ‌ర్భంలో క‌లిసి పోతాన‌ని. కానీ మృత్యువు హెలికాప్ట‌ర్ రూపంలో పొంచి ఉంద‌ని. భార‌త దేశంలో మ‌రాఠా రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి. అక్క‌డ రాజీలంటూ ఉండ‌వు. రాజీ ప‌డ‌డం ఉండ‌దు. కేవ‌లం తాడో పేడో తేల్చు కోవ‌డానికే ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఉంటుంది. బాబాయి శ‌ర‌ద్ ప‌వార్ శిష్యరికంతో ప్రారంభ‌మైన ఆయ‌న జీవితం బారామ‌తి వ‌ర‌కు సాగింది. ఒక ర‌కంగా ఆ ప్రాంతం త‌న‌తో బంధాన్ని పెన‌వేసుకుంది. రాజకీయాల్లో వారసత్వం రావడం సహజం, కానీ ఆ వారసత్వాన్ని ధిక్కరించి, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించు కోవడం అసాధారణ‌మైన విష‌యం. అజిత్ ప‌వార్ రాజ‌కీయ నేత అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే.త‌ను అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్న వ్య‌క్తి. కానీ ఏనాడూ త‌ల వంచింది లేదు. మ‌రాఠా యోధుడిగానే నేను ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని చాలా సార్లు ప్ర‌క‌టించాడు అజిత్ ప‌వార్ . త‌న‌ను అక్క‌డి వారంతా ప్రేమతో దాదా అని పిలుచుకుంటారు. దాదా అంటే నాయ‌కుడు, ఇంటికి పెద్ద‌న్న అని అర్థం. అజిత్ పవార్ అంటే కేవలం ఒక పేరు మాత్ర‌మే కానే కాదు. మ‌రాఠా పొలిటిక‌ల్ క్రీడ‌లో ఒక తిరుగులేని , విస్మ‌రించ లేని ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్. ప్ర‌తిప‌క్షాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేయ‌డంలో త‌ను స‌క్సెస్ అయ్యాడు.

ప‌దునైన వ్యూహాల‌తో ఉక్కిరి బిక్కిరి చేశాడు. చద‌రంగం లాంటి రాజ‌కీయంలో ఎలా పావులు క‌ద‌పాలో, ఎప్పుడు ఎవ‌రిని ఎలా సైడ్ చేయాలో, ఎలా ప‌వ‌ర్ ను ఎంజాయ్ చేయాలో , ఎలా ప‌నులు చేసి పెట్టాలో త‌ను అనుభ‌వంలో చేసి చూపించాడు. అంతే కాదు త‌న రాజ‌కీయ పురోగ‌తికి దోహ‌దం చేసిన బాబాయ్ శ‌ర‌ద్ ప‌వార్ కోసం త‌న ఎంపీ సీటును వ‌దులుకున్నాడు. ఎద‌గాలంటే ప‌ద‌వులే ఉండ‌క్క‌ర్లేదు..ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉంటూ వారి కోసం ప‌ని చేస్తే చాలు అని ప్ర‌క‌టించాడు. ఒక‌టా రెండా ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు అజిత్ ప‌వార్. ఆరు సార్లు ఉప ముఖ్య‌మంత్రిగా రాజ‌కీయ చ‌రిత్ర‌లో అరుదైన చ‌రిత్ర సృష్టించాడు. త‌ను ఓన‌మాలు నేర్చుకున్న బాబాయ్ త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డం ప‌ట్ల క‌ల‌త చెందాడు. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో తిరుగుబాటు జెండా ఎగుర వేశాడు. పార్టీ గుర్తును, పేరును సాధించేంత దాకా నిద్ర పోలేదు. త‌న‌కున్న ఏకైక క‌ల ఘ‌న‌మైన వార‌స‌త్వం, అంత‌కు మించిన పోరాట చ‌రిత్ర క‌లిగిన మ‌రాఠాకు ముఖ్య‌మంత్రి కావాల‌ని . కానీ అది తీర‌కుండానే నిష్క్ర‌మించాడు. ఏది ఏమైనా అజిత్ ప‌వార్ రాజ‌కీయాల‌లో నిజ‌మైన దాదా కాదంటారా..!

  • Related Posts

    యోగి స‌ర్కార్ ను భ‌యపెడుతున్న కుర్రాడు

    Spread the love

    Spread the loveదేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన అశ్వమిత్ గౌతం ఉత్త‌ర ప్ర‌దేశ్ : ఎవ‌రైనా ప‌ద్నాలుగు ఏళ్లు వ‌స్తే ఏం చేస్తారు..? సోష‌ల్ మీడియాలో గ‌డిపేందుకు ఇష్ట ప‌డ‌తారు. సినిమాలు, షికార్లు, ల‌వ్ ఎఫైర్లు, కార్లు, బైక్ ల‌ను ఇష్ట…

    ధిక్కార ప‌తాకం రోహిణి సంచ‌ల‌నం

    Spread the love

    Spread the loveమ‌హిళ‌ల‌కు కూడా హ‌క్కులు ఉంటాయ‌ని కామెంట్స్ వెండి తెర‌పై క‌ద‌లాడే బొమ్మ‌ల‌కు కూడా స్వేచ్ఛ ఉంటుంద‌ని, వాటికి కూడా మ‌న‌సు అనేది ఉంద‌ని, అప్పుడ‌ప్పుడు స్పందిస్తూ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు సుతిమెత్త‌గా , సూటిగా న‌టి రోహిణి. సినీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *