వ్య‌వ‌సాయ రంగానికి కూట‌మి స‌ర్కార్ ప్రాధాన్య‌త

Spread the love

ఇస్తుంద‌న్న మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

ఏలూరు జిల్లా : కూట‌మి స‌ర్కార్ అత్యధికంగా వ్య‌వ‌సాయ రంగానికి ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథ‌కానికి గత ప్రభుత్వం 7500 కోట్లు కేటాయించినప్పటికీ, 5 సంవత్సరాలలో కేవలం 1300 కోట్లు రూపాయలు మాత్రమే రైతులకు అందించిందన్నారు. తమ ప్రభుత్వం గత బడ్జెట్లో 300 కోట్లు కేటాయించి సంవత్సరకాలంలో 1200 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ప‌థ‌కానికి రైతులకు అందించామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామని, పంట కోత అనంతరం కోకో గింజల నాణ్యత తగ్గకుండా ఉండేలా తీసుకోవలసిన చర్యలపై రైతులకు తెలియ జేస్తున్నామన్నారు. దీని కారణంగా కోకో పంటకు మంచి ధర లభిస్తుందన్నారు.

కోకో పంట సాగులో తక్కువ ఖర్చుతో, నాణ్యమైన పంట అధిక దిగుబడి, రైతుకు లాభసాటిగా ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. కోకో కాంక్లేవ్ సదస్సును శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కలిస్తారని తెలిపారు అచ్చెన్నాయుడు. నాణ్యమైన కోకో ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ప్రభుత్వ, బ్యాంకర్ల సహకారం తదితర అంశాలు కాంక్లేవ్ లో తెలియ జేస్తారన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 44 వేల 984 ఎకరాలలో కోకో సాగవుతోందన్నారు, 10 వేల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తితో దేశంలోనే ఏలూరు జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లా జిడిపి వృద్ధిలో లో ఉద్యానవన పంటల పాత్ర ప్రధానమైనదన్నారు.

  • Related Posts

    అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    Spread the love

    Spread the loveశ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది.…

    త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    Spread the love

    Spread the loveమ‌హ‌నీయుడ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *