న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం రూడీ అయ్యింది
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన లిక్కర్ స్కాం కేసులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ఈ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తదితరులకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు .
తాను ముందు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు చెబుతూ వచ్చానని అన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పానని అదే ఇవాళ నిజమైందని పేర్కొన్నారు. అదే నిజమైంది. దీంతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం అని వాపోయారు. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను -వాడుకుంటున్నారని ఆరోపించారు కేంద్ర సర్కార్ పై. కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత.





