ప్రగాఢ సానుభూతి తెలిపిన వాసంశెట్టి సుభాష్
అమరావతి : కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలోని బాణసంచా కర్మాగారంలో శనివారం జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు
గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అగ్నిమాపక సిబ్బంది , రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వాసం శెట్టి సుభాష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు .|ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తామని కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ హామీ ఇచ్చారు.





