క‌న‌క‌దుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

Spread the love

ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య అర్చ‌కులు

విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం వేకువజామున విజయవాడకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బెజ‌వాడ‌లో కొలువు తీరిన కోరిన కోర్కెలు తీర్చే ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు అమ్మవారి జ్ఞాపిక, శాలువాతో మంత్రిని సత్కరించారు.

అమ్మవారి దర్శనార్థం వచ్చిన తెలుగు రాష్ట్రాల భక్తులు మంత్రితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మంత్రి వెంట ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలుగా విడి పోయినా మ‌నంద‌రం ఒక్క‌టేనని అన్నారు.

  • Related Posts

    టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆల‌యం

    Spread the love

    Spread the loveఆల‌య అధికారుల‌కు అంద‌జేసిన రికార్డులు తిరుపతి : తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య…

    మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

    Spread the love

    Spread the loveవివ‌రాలు వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి. 3న కుమారధార తీర్థ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *