ఆకాశమే హద్దుగా చెలరేగిన కీవీస్ బ్యాటర్
కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్ ఫిన్ అలెన్. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన కీలక పోరులో భారత జట్టుకు చెందిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ను మరిచి పోక ముందే మరో సూపర్ షోతో ఆకట్టుకున్నాడు కీవీస్ ప్లేయర్ ఫిన్ అలెన్. వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. సఫారీ జట్టులో మార్కో యాన్సెస్ 30 బంతులలో 55 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. తనతో పాటు బ్రెవిస్ 27 బంతులలో 3 ఫోర్లు 2 సిక్స్ లతో 34 పరుగులు చేశాడు.
అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవీస్ ఆది నుంచే సఫారీలను ఉతికి ఆరేయడం మొదలు పెట్టాడు అలెన్. తను కేవలం కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 10 ఫోర్లు 8 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. మైదానం నలుమూలలా ఆకట్టుకునేలా, కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు ఫిన్ అలెన్. తనతో పాటు టిమ్ సిఫర్ట్ 33 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్స్ లతో 58 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్ కు చేర్చారు.





