అందిస్తున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తమ ప్రజా సర్కార్ క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల FIH Hockey World Cup 2026 క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే టీమ్‌కు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా స్టార్ట్ చేశారు.
వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ టోర్నమెంట్లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్ – ఏ లో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్ – బీ లో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీతో పాటు శాప్ చైర్మన్ శివ సేనా రెడ్డి పాల్గొన్నారు.






