దిశా నిర్దేశనం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీలో మౌలిక వసతి సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం
క్రీడాశాఖ పై సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు అనువుగా మైదానాల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించాల్సిందిగా ఆదేశించారు.
గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియం పునరుద్ధరణ తో పాటు ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీఎం. నిర్మాణాల డిజైన్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





