గ్రంథాల‌యాల అభివృద్దికి కృషి చేస్తా

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమ‌వారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి ప్ర‌సంగించారు. రూ.22 లక్షల నిధులు వెచ్చించి లైబ్రరీ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా పెనుమూలి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

లైబ్రరీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేసమనేని శ్రీ అనిత, పెనుమూలి గ్రామ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఖాశీం, గ్రామ సర్పంచ్ కొరిటాల పద్మావతి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జ‌గ‌న్ చేసిన దుర్మార్గాల‌ను స‌రిచేస్తున్నాం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ లో ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా…

    చంద్రబాబును విమర్శించే అర్హత జ‌గ‌న్ కు లేదు

    Spread the love

    Spread the loveరాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *