సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్

Spread the love

5 ఇన్నింగ్స్ లు 321 ప‌రుగుల‌తో రికార్డ్

అహ్మ‌దాబాద్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ కప్ ఫార్మాట్ లో వ‌రుస‌గా మూడు హాఫ్ సెంచ‌రీలు చేసి రికార్డ్ నెల‌కొల్పాడు. గ‌తంలో భార‌త క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కు చెందిన అఫ్రిదీ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. త‌న‌లో స‌త్తా ఉంద‌ని, త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించాడు . త‌న 11 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక‌సారి జ‌ట్టులో ఎంపికైతే మ‌రోసారి జ‌ట్టు నుంచి తీసి వేయ‌డం, అవ‌మానాల‌కు గురి కావ‌డం జ‌రిగింది. కానీ వాటిని అన్నింటిని తోసి రాజ‌ని త‌న‌కు వ‌చ్చిన అరుదైన ఛాన్స్ ను త‌ను వాడుకున్నాడు.

భార‌త జ‌ట్టును విశ్వ విజేత‌గా నిల‌వ‌డంలో, క‌ప్ ను అందుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. త‌ను ఆడ‌క పోయి ఉంటే ఇవాళ భార‌త్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను అందుకునేది కాదు. కోచ్ , కెప్టెన్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా సూప‌ర్ షో చేశాడు సంజు శాంస‌న్. ఇదిలా ఉండ‌గా ఈ టోర్నీలో త‌ను 5 ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 321 ప‌రుగులు చేశాడు. 80.26 స‌గ‌టుతో, 199.38 స్ట్రైక్ రేట్ తో మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. టోర్నీలో సంజు శాంస‌న్ 24 సిక్సర్లు, 27 ఫోర్లు ఉన్నాయి. వెస్టిండీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో 50 బంతులు ఎదుర్కొని 97 ర‌న్స్ చేశాడు. సెమీస్ లో ఇంగ్లండ్ తో 42 బంతులు ఎదుర్కొని 89 ర‌న్స్స చేయ‌గా, ఫైన‌ల్ లో 46 బాల్స్ ఎదుర్కొని 89 ర‌న్స్ చేశాడు.

  • Related Posts

    స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో సౌక‌ర్యాలు క‌ల్పించాలి

    Spread the love

    Spread the loveదిశా నిర్దేశ‌నం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో మౌలిక వ‌స‌తి స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్…

    సంజు శాంస‌న్ మ్యాచ్ విన్న‌ర్ ప్లేయ‌ర్ : గ‌వాస్క‌ర్

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన మాజీ కెప్టెన్ సన్నీ అహ్మ‌దాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను ఆకాశానికి ఎత్తేశాడు. త‌ను భార‌త జ‌ట్టుకు క‌ప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *