రికార్డుల కంటే నాకు దేశం ముఖ్యం : సంజు శాంస‌న్

Spread the love

తిరువ‌నంత‌పురంకు చేరుకున్న స్టార్ క్రికెట‌ర్

కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అసాధార‌ణ‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌న స్వ‌స్థ‌లం తిరువ‌నంత‌పురం. టోర్నీలో త‌ను 321 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక‌య్యాడు. అహ్మ‌దాబాద్ నుంచి నేరుగా తిరువ‌నంత‌పురంకు చేరుకున్నాడు సంజు శాంస‌న్ భారీ భ‌ద్ర‌త మ‌ధ్య‌. వేలాది మంది త‌న‌ను చూసేందుకు త‌ర‌లి వ‌చ్చారు అభిమానులు. ఇదే సంద‌ర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శాంస‌న్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. బొకే ఇచ్చి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్బంగా సంజు శాంస‌న్ మీడియాతో మాట్లాడాడు. ఇది ఒక కల లాంటిది. ఈ కలను కనడానికి నాకు ధైర్యం ఉంది

నా దేశం కోసం దాన్ని గెలవాలని నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడు ఉన్న విధంగా మారే విధంగా నేను సహకరించాలని అనుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కోట్లాది మంది న‌న్ను ఆశీర్వ‌దించారు. బాగా ఆడాల‌ని దీవించారు. మ‌రికొంద‌రు ప్రార్థ‌న‌లు కూడా చేశారు. వారంద‌రికీ నేను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాను. నా చిన్ననాటి రోజుల నుండి పరిస్థితులను సానుకూలంగా చూడటానికి నేను శిక్షణ పొందాను. సాధారణంగా అన్ని బాధలు, అన్ని ఎదురు దెబ్బలు నన్ను చాలా బలవంతుడిని చేశాయని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నాడు.

జీవితంలో, నా కెరీర్‌లో అన్ని బాధలు, ఎదురు దెబ్బలు, నిరాశలను సానుకూలంగా ఉపయోగించినట్లయితే, మీ జీవితంలో గొప్ప బలం కాగలదని నేను భావిస్తున్నాను అని స్ప‌ష్టం చేశాడు సంజు శాంస‌న్.

  • Related Posts

    సంజు శాంస‌న్ వ‌ల్ల‌నే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాం

    Spread the love

    Spread the loveక్రిష్ణ‌మాచారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చెన్నై : మాజీ క్రిక‌టెర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ గురించి. త‌ను ఆడ‌క పోతే ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి ఉండేది కాద‌న్నాడు.…

    విజేత‌కు ప‌ర్యాయ‌ప‌దం గౌతం గంభీర్

    Spread the love

    Spread the loveవ‌రుస‌గా రెండోసారి టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు వ‌రుస‌గా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంతో ఒక్క‌సారి హెడ్ కోచ్ గా ఉన్న భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్ పేరు ఇప్పుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *