సంచలన ఆరోపణలు చేసిన దానం నాగేందర్
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసన సభ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నేరుగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిప్పులు చెరిగారు.
తన తండ్రి కష్టపడి సంపాదించిన సొంత భూమిని కేటీఆర్ అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో భయం వల్ల మౌనంగా ఉన్నామని అన్నారు. కానీ ఇప్పుడు ఆ బెరుకు పోయిందన్నారు ఎమ్మెల్యే.
ఈ సందర్బంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్ కు ఈ మొత్తం భూమి కబ్జా సంఘటనకు సంబందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకు గాను వెంటనే కేబినెట్ స్పందించాలని, తక్షణమే హౌస్ కమిటీ వేయాలని దానం డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభ ముందు ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదంతా బక్వాస్ అంటూ కొట్టి పారేశారు.





