newsseals.com
News

కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణాల మ‌యం

VijayaBhaskar March 29, 2026
newsseals-KTR
Spread the love

విచార‌ణ చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నేత‌లు కేటీఆర్, హ‌రీష్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై. రెండున్న‌ర ఏళ్ల కాలంలో లెక్క‌కు మించి అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. వెంట‌నే ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వీటిపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ఇందులో ప‌క్కా ఆధారాల‌తో స‌మ‌ర్పించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పాల‌నా కాలంలో చోటు చేసుకున్న స్కామ్ ల‌ను వివ‌రించారు కేటీఆర్, హ‌రీష్ రావు.

సివిల్ సప్లై స్కాం, అమృత్ టెండర్ల స్కాం, KLSR స్కాం , నైనీ కోల్ బ్లాక్ – సింగరేణి స్కాం, సింగరేణి ఓబీ స్కాం, సోలార్ పవర్ స్కాం, NTPC థర్మల్ పవర్ స్కాం, హెచ్‌సీయూ భూముల స్కాం, లగచర్ల ల్యాండ్ స్కాం, కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా స్కాం, ఎక్సైజ్ మైక్రో బ్రూవరీ స్కా, హమ్ రోడ్స్ స్కాం, TDR స్కాం, యంగ్ ఇండియా స్కూల్స్ స్కాం, ఫోర్త్ సిటీ స్కాం, హిల్ టీపీ స్కాం, అక్రమ మైనింగ్ స్కాం, డెక్కన్ సిమెంట్స్ స్కాం, మంచి రేవుల దేవాదాయ భూముల కుంభకోణం చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు.

విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయడం తప్పనిసరి అన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామ‌న్నారు.. ప్రజా ధనాన్ని రక్షించడం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం, అవినీతి అక్రమాలను అడ్డుకోవడం రాజ్యాంగ బద్ధమైన మీ బాధ్యత అని పేర్కొన్నారు.