నితీశ్ కుమార్ కు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ

Spread the love

ఇటీవ‌లే సీఎం ప‌ద‌వి రాజీనామా

బీహార్ : దేశ రాజ‌కీయాల‌లో సుదీర్ఘ‌మైన పాల‌నా అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందాడు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా త‌ను ఎన్డీయే కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరనున్నారు. దీంతో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఇటీవ‌లే రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం జేడీయు అధ్య‌క్షుడిగా ఉన్నారు నితీశ్ కుమార్. ఆయ‌న త్వరలో పార్లమెంటుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని త్యజించాల్సి వ‌చ్చింది.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు జెడ్ ప్ల‌స్ భద్రత కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేష‌న్ కూడా పేర్కొంది స‌ర్కార్. మార్చి 16న రాజ్యసభకు ఎన్నికైన కుమార్, ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న సభ్యుల పదవీకాలం ముగిసిన తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం రాష్ట్ర హోం శాఖ కీల‌క నోటిఫికేష‌న్ జారీ చేసింది సెక్యూరిటీ గురించి. నితీష్ కుమార్ రాజ్యసభలో ప్రవేశించిన తర్వాత జెడ్ ప్ల‌స్ స్థాయి భ‌ద్ర‌త‌ను పొందుతారు. కుమార్ రాష్ట్రంలోని ‘బీహార్ ప్రత్యేక భద్రతా చట్టం, 2000’ కింద కల్పించబడిన ప్రత్యేక భద్రతను అనుభవించారు. ఈ చట్టం ప్రధానమంత్రి కోసం ఉద్దేశించిన ఎస్పీజీ నమూనాలో రూపొందించారు.

  • Related Posts

    రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్

    Spread the love

    Spread the loveభార‌తీయ క‌ళా రంగంలో అరుదైన రికార్డ్ న‌మోదు న్యూఢిల్లీ : భార‌తీయ క‌ళా రంగంలో అరుదైన ఘ‌న‌త చోటు చేసుకుంది. ప్ర‌ముఖ చిత్ర‌కారుడు, దివంగ‌త రాజా ర‌వివ‌ర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది.…

    జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు

    Spread the love

    Spread the loveరాష్ట్రంలో అంబురాన్నింటిన సంబురాలు పెనుకొండ : అమ‌రావ‌తి రాజ‌ధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంద‌డంతో ఏపీలో పెద్ద ఎత్తున సంబురాలు మిన్నంటాయి. ఈ సంద‌ర్బంగా మంత్రి ఎస్. స‌విత ఆధ్వ‌ర్యంలో పెనుకొండ‌లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *