లోక్ సభలో ఎంపీ రఘునందన్ రావు
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు లోక్ సభ సాక్షిగా. జీరో అవర్ లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. భాగ్యనగరం లో ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉందని, అది శంషాబాద్ లో మాత్రమేనని పేర్కొన్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ దేశ , విదేశాలకు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారని , దీంతో స్థలం సరి పోవడం లేదన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కెపాసిటీ ఏటా 40 లక్షల ప్రయాణికులు మాత్రమేనని పేర్కొన్నారు.
2025-26 లెక్కల ప్రకారం ఇప్పటికే 35 లక్షల ప్యాసింజర్స్ ప్రయాణం చేశారని వెల్లడించారు ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ లో ఒకటే ఎయిర్ పోర్ట్ ఉందని, ఆంధ్రా లో ఎనిమిది ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు ఎంపీ. కానీ మోదీ సర్కారు వచ్చాక మామునూరు, ఆదిలాబాద్ ల లో విమానాశ్రయాలు మంజూరు చేశారని తెలిపారు. తెలంగాణ సర్కారు వెంటనే భూసేకరణ జరిపి నూతన విమానాశ్రయాల నిర్మాణం కోసం మద్దతు ఇవ్వాలని కోరారు సభా సాక్షిగా. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం లో కూడా రెండవ టెర్మినల్ వెంటనే పూర్తి చేయాలని కోరారు.





