శంషాబాద్ లో రెండో టెర్మిన‌ల్ పూర్తి చేయాలి

లోక్ స‌భ‌లో ఎంపీ ర‌ఘునంద‌న్ రావు

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు లోక్ స‌భ సాక్షిగా. జీరో అవ‌ర్ లో ఆయ‌న ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. భాగ్యనగరం లో ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉందని, అది శంషాబాద్ లో మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి రోజూ దేశ , విదేశాల‌కు వేలాది మంది ప్ర‌యాణం చేస్తుంటార‌ని , దీంతో స్థ‌లం స‌రి పోవ‌డం లేద‌న్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కెపాసిటీ ఏటా 40 లక్షల ప్రయాణికులు మాత్రమేన‌ని పేర్కొన్నారు.

2025-26 లెక్కల ప్రకారం ఇప్పటికే 35 లక్షల ప్యాసింజర్స్ ప్రయాణం చేశారని వెల్ల‌డించారు ఎంపీ రఘునంద‌న్ రావు. తెలంగాణ లో ఒకటే ఎయిర్ పోర్ట్ ఉందని, ఆంధ్రా లో ఎనిమిది ఎలా మంజూరు చేస్తారంటూ ప్ర‌శ్నించారు ఎంపీ. కానీ మోదీ సర్కారు వచ్చాక మామునూరు, ఆదిలాబాద్ ల లో విమానాశ్రయాలు మంజూరు చేశారని తెలిపారు. తెలంగాణ సర్కారు వెంటనే భూసేకరణ జరిపి నూతన విమానాశ్రయాల నిర్మాణం కోసం మద్దతు ఇవ్వాలని కోరారు స‌భా సాక్షిగా. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌న్నారు. శంషాబాద్ విమానాశ్రయం లో కూడా రెండవ టెర్మినల్ వెంట‌నే పూర్తి చేయాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *