ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా పోలీస్ సేవ‌లు

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం పోలీసులు చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టించారు మంత్రి. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని , పెదవేగి సర్కిల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు వంగ‌ల‌పూడి అనిత‌. మహిళలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, ఫిర్యాదుదారులకు త్వరితగతిన సేవలు అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించడం జ‌రిగింద‌ని చెప్పారు.

త‌మ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించామ‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా, ప్రజలకు చేరువగా పోలీసు సేవలను తీసుకెళ్లడమే మా ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో పోలీసుల‌కు విలువ లేకుండా చేశార‌ని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక పోలీస్ ఫ్రెండ్లీ స‌ర్కార్ గా మార్చేశామ‌ని అన్నారు. ఏ ఒక్క‌రికి అన్యాయం జ‌రిగినా ఊరుకునేది లేద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెర‌గాలి

    Spread the love

    Spread the loveపిలుపునిచ్చిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. మ‌రింత పెద్ద ఎత్తున భాగ‌స్వామ్యం క‌లిగి…

    ప్రాంతీయ పార్టీల‌ను అస్థిర ప‌రిచేందుకు కుట్ర‌

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డీకే శివ‌కుమార్ త‌మిళ‌నాడు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో బీజేపీ మాత్ర‌మే ఉండాల‌ని అనుకుంటోంద‌ని ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు. త‌మిళ‌నాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *