ప్రాంతీయ పార్టీల‌ను అస్థిర ప‌రిచేందుకు కుట్ర‌

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డీకే శివ‌కుమార్

త‌మిళ‌నాడు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో బీజేపీ మాత్ర‌మే ఉండాల‌ని అనుకుంటోంద‌ని ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో డీకే శివ‌కుమార్ డీఎంకే కూట‌మి త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్బంగా త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెంగ‌ల్ప‌ట్టులో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ పై నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. ఇంకా రాజ‌కీయాల‌లో ఓన‌మాలు నేర్చుకోలేదంటూ ఎద్దేవా చేశారు.

ప్రాంతీయ పార్టీలను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను అస్థిరపరిచేందుకు ఒక పెద్ద కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు డీకే శివ‌కుమార్ . కానీ మనమందరం ఏకమై, కలిసి పనిచేసినప్పుడు, అది అసాధ్యం అవుతుందని అన్నారు. మనం మళ్ళీ పుంజుకుంటాం, ఈ దేశాన్ని మరోసారి పరిపాలిస్తాం అని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ విషయంలో నమ్మకంతో ఉండాల‌ని పిలుపునిచ్చారు పార్టీ శ్రేణుల‌కు. సుమారు 20 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. తాము నిర్వ‌హించిన స‌ర్వేలో స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే కూట‌మి మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రాబోతోంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *