తెలంగాణ ఆర్టీసీలో త్వ‌ర‌లో పోస్టుల భ‌ర్తీ

Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. డీఏ పెంపుతో పాటు అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జ‌రిగింద‌న్నారు. అంతే కాక త్రిసభ్య కమిటీ ద్వారా దీర్ఘకాలంగా విధులకు దూరమైన వారిని తిరిగి తీసుకోవడం, కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్టీసీ ఆసుపత్రిని ఆధునీకరించడం చేశామ‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

ఈ సంద‌ర్భంగా మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా నియామకాల చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సంస్థ ఉద్యోగులకు డీఏను చెల్లించాలని మంత్రి ఆదేశించడం పట్ల టీజీఎస్‌ఆర్టీసీ వీసీ అండ్‌ ఎండీ వై. నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఈ డీఏ పెంపు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగలదని ఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈడీ లు . సిహెచ్.వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, స‌ల్మాన్, ఎఫ్ఏ విజయపుష్ప, సిటీఎం ఏం & సి .శ్రీధర్, సిపిఎం ఉషాదేవి, సీసీఈ కవిత తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలుగుదేశం పార్టీ మ‌హానాడు

    Spread the love

    Spread the loveనిర్వ‌హిస్తామ‌న్న పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అమ‌రావ‌తి : ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసారి భారీ ఎత్తున మ‌హానాడు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళతెలుగుదేశం…

    ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *