కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు
అమ‌రావ‌తి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాఉ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం TDP బాధ్యతల నుంచి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు కంచర్ల శ్రీకాంతను తప్పించారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన కుప్పం టీడీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన తర్వాత కుప్పం నా నియోజకవర్గం.. ఇకపై అన్ని నేనే చూసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు .

అవసరమైతే రాష్ట్ర స్థాయిలో మీ సేవలను వాడుకుంటాన‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తాన‌ని చెప్పారు. ఇక నుంచి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు సంబంధిత శాఖల బాధ్యతలు మాత్ర‌మే చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా కాద‌ని గీత దాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని వార్నింగ్ ఇచ్చారు. మరో మూడు నెలల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. రెండు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తాన‌ని అన్నారు.

  • Related Posts

    ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాలి

    ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల…

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *