21న కొలువు తీరనున్న షర్మిల
బాధ్యతలు చేపట్టేందుకు రెడీ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలా రెడ్డి ఈనెల 21న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీసీసీసీ అధికారికంగా బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. విజయవాడ లోని ఆంధ్ర రత్న భవన్ లో ఉదయం 11 గంటలకు బాధ్యతలు చేపడతారని తెలిపింది.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీకి చెందిన ప్రముఖ నేతలు హాజరవుతారని వెల్లడించింది. ఇదిలా ఉండగా అనూహ్యంగా వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా ఎంపికయ్యారు. అంతకు ముందు పెద్ద తతంగమే నడిచింది. ఆమె ప్రధానంగా తెలంగాణ రాజకీయాలలో ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ సర్కార్ ను ఏకి పారేశారు. ఎన్నికల బరిలో నిలబడతారని భావించారు. కానీ ఉన్నట్టుండి తాను పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అనుకున్నట్టు గానే తన పార్టీని విలీనం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ కూలి పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం రాజకీయాలు వేగంగా మారాయి. షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఆమెకు కీలకమైన ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించింది. ప్రెసిడెంట్ గా ఉన్న గిడుగు రుద్రరాజును ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.