Sunday, April 6, 2025
HomeDEVOTIONAL25న శ్రీ‌రామ‌కృష్ణ తీర్థ ముక్కోటి

25న శ్రీ‌రామ‌కృష్ణ తీర్థ ముక్కోటి

వెల్ల‌డించిన టీటీడీ ఈవో వీర‌బ్ర‌హ్మం

తిరుమ‌ల – ఈనెల 25న తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంద‌ని టీటీడీ అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) వీరబ్రహ్మం వెల్ల‌డించారు. తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వీరబ్రహ్మం మాట్లాడుతూ తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటి అని తెలిపారు. భ‌క్తులు భారీగా త‌ర‌లి రానున్నార‌ని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

యాత్రికుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదం, తాగు నీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై సమీక్షించారు.

అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించబోమని మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని చీఫ్‌ పీఆర్‌వో డా. టి.రవిని ఆదేశించారు. తీర్థం వద్ద పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు.

కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ 30 నుండి 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. జనవరి 25వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments