నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ
భారీ ఎత్తున పెరిగిన వరద ఉధృతి
నల్లగొండ జిల్లా – భారీ ఎత్తున కురుస్తున్న వర్షాల తాకిడికి ఇటు తెలంగాణ అటు ఏపీ అల్లాడుతున్నాయి. అంతకంతకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాలో పేరు పొందిన నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తిగా నిండి పోయింది. జల కళను సంతరించుకుంది.
ఎగువన కురుస్తున్న వర్షాల తాకిడికి జలాశయం నిండు కుండను తలపింప చేసింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు అధికారులు ముందు జాగ్రత్తగా 24.క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇదిలా ఉండగా ఇన్ ఫ్లో 2,63,431 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2,63,431 క్యూసెక్కులుగా ఉంది.
పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులుగా ఉంది.
ఇక నాగార్జున డ్యాంకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 311. 7462 టీఎంసీలుగా ఉంది. కాగా నీటిని విడుదల చేయడంతో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు.