27 లక్షల మందికి రైతు బంధు
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రైతు బంధుపై అవాకులు చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్ నేతలకు చురకలు అంటించింది. తాము కొలువు తీరి రాష్ట్రంలో నేటికి కేవలం నెల రోజులు మాత్రమే అయ్యిందని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చినట్టుగానే అమలు చేస్తూ వస్తున్నామని వెల్లడించింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 శాతం మంది రైతులకు రైతు బంధు పథకం కింద నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు.
దాదాపు 27 లక్షల మంది రైతులకు రైతు బంధు పడిందని తెలిపారు. త్వరలోనే మిగతా వారికి కూడా వారి ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పారు. పాలనా పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయని వాటిని సరి చేసుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
తాము 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్నారని వారు ఈపనిని సమర్థవంతంగా ఎందుకు చేయలేక పోయారని ప్రశ్నించారు తుమ్మల నాగేశ్వర్ రావు. కేవలం ప్రజలను రెచ్చ గొట్టేందుకు తప్పిస్తే ఇంకేమీ కాదన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు మారాలని సూచించారు. లేక పోతే ప్రజలు మరోసారి బండకేసి కొడతారని హెచ్చరించారు.